← Back to news

రక్షణ కల్పించాలని పోలీసులను ఆశ్రయించిన సర్పంచ్

By అనిల్ బాబు· 2h ago· Kommenapally, Kamepalli, Khammam
రక్షణ కల్పించాలని పోలీసులను ఆశ్రయించిన సర్పంచ్

మహబూబాబాద్ జిల్లా కురవి మండలం గుండ్రాతిమడుగు గ్రామసర్పంచ్ బండ రాజేశ్వరి తనకు, తన కుటుంబసభ్యులకు రక్షణ కల్పించాలని కురవి పోలీసులను ఆశ్రయించారు. గ్రామంలోని పెద్దచెరువు మట్టి తరలింపు విషయంలో వివాదం నెలకొన్నట్లు ఆమె తెలిపారు. ఎలాంటి అనుమతులు లేకుండా చెరువు మట్టిని తరలించి ప్రైవేట్ వ్యక్తులు, రైస్ మిల్లులకు విక్రయిస్తున్నారని ఆరోపించారు. వ్యవహారాన్ని అడ్డుకోవడంతో ఉపసర్పంచ్, 10వ వార్డు సభ్యుడి నుంచి బెదిరింపులు ఎదురవుతున్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు.

More in Local