పిట్లంలో లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు

కామారెడ్డి జిల్లా పిట్లంలోని శివాజీ చౌక్ వద్ద కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు నిర్వహించారు. జాతీయ BC సంక్షేమ సంఘం కామారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు, చేనేత సహకార సంఘం వైస్ చైర్మన్ నీలకంటి సంతోష్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నీలకంటి సంతోష్ మాట్లాడుతూ.. బాపూజీ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. BCలు ఐకమత్యంతో ముందుకు సాగి తమ హక్కుల కోసం కృషి చేయాలని కోరారు.



