భారీ వర్షాలపై అరకులోయలో అలర్ట్

భారీ వర్షాల నేపథ్యంలో అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయ మండలంలో అధికారులు అప్రమత్తమయ్యారు. MRO రాజా శ్రీధర్, MPDO వీసం ప్రసాద్ ఆధ్వర్యంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు అత్యవసర సమయాల్లో మండల ప్రజలు ఈ నంబర్లను 9494164494, 9494138597, 9866233806 సంప్రదించాలని తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లోనే కంట్రోల్ రూమ్ సిబ్బందిని సంప్రదించాలని సూచించారు.


