ప్రమాదంలో రెండు కాళ్లు విరిగి.. దాతల కోసం ఎదురుచూపులు

విజయనగరం జిల్లా రాజాం మండలం పొగిరి గ్రామానికి చెందిన కొండేటి రాజేశ్వరి ఐదు నెలలుగా ఆసుపత్రిలో మంచానికే పరిమితమైంది. గతంలో భర్త అచ్చయ్యతో కలిసి కూలీపనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేది. 5 నెలల క్రితం బంధువులతో కలిసి ఆటోలో పెళ్లికి వెళ్తుండగా పాలకొండ సమీపంలో తుమరాడ దగ్గర ఆటో బోల్తా పడటంతో రాజేశ్వరికి రెండు కాళ్లు విరిగాయి. ఇద్దరు పిల్లలు సర్కారు బళ్లో చదువుతున్నారు. ఆసుపత్రి ఖర్చులు భారంగా మారడంతో దాతల సహాయం కోసం ఎదురుచూస్తున్నారు.




