షార్ట్ సర్క్యూట్.. 10 లక్షల ఆస్తి నష్టం

మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్ మండలం బోయిన్‌పల్లికి చెందిన శశిధర్‌రెడ్డి ఇంట్లో బుధవారం తెల్లవారుజామున ఫైర్ యాక్సిడెంట్. కిచెన్‌లో షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి. కబోర్డ్, ఫర్నిచర్, వాటర్ ప్యూరిఫైర్, చిమ్నీ కాలిపోయాయి. కుటుంబ సభ్యులు అలర్ట్ అయ్యి మంటలను అదుపు చేశారు. ప్రాణనష్టం తప్పింది. సుమారు 10 లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగినట్లు తెలిపారు.


