← Back to news

ప్రాణం తీసిన.. మైనర్ డ్రైవింగ్‌

By Lokesh· 2h ago· Indiatimes

క్రికెట్ ఆడేందుకు వెళ్తున్నానని తల్లికి చెప్పి ఇంటి నుంచి వెళ్లిన 15 ఏళ్ల సుజన్ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. కర్ణాటకలోని దావణగెరె సమీపంలో నేషనల్ హైవే 48పై ఈ ప్రమాదం జరిగింది. స్నేహితులతో కలిసి హ్యుందాయ్ క్రెటా కారులో వెళ్తుండగా, అది CNG గ్యాస్‌ తరలిస్తున్న లారీ వెనుక భాగాన్ని ఢీకొట్టింది. సుజన్ అక్కడికక్కడే మృతి చెందగా, మరో బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. మూడో బాలుడికి స్వల్ప గాయాలయ్యాయి.

More in National