పట్టాదారు పాస్‌పుస్తకాల పంపిణీ

అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేట మండలంలోని భీమవరం, చిట్టెంపాడు గ్రామాల్లో ‘మీ భూమి–మీ హక్కు’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ అరకు నియోజకవర్గ ఇన్‌చార్జ్ డాక్టర్ సియ్యారి దొన్నుదొర పాల్గొని రైతులకు పట్టాదారు పాస్‌పుస్తకాలను అందజేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుతో రైతుల్లో భరోసా పెరిగిందని ఆయన తెలిపారు. రైతుల భూములకు మరింత రక్షణ కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు.


