ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు

సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో స్వాతంత్ర్య సమరయోధుడు, తెలంగాణ ఉద్యమ నేత కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ నరసింహ బాపూజీ చిత్రపటానికి నివాళులర్పించారు. దేశ స్వాతంత్ర్యం కోసం, నిజాం పాలనకు వ్యతిరేకంగా, ప్రత్యేక తెలంగాణ కోసం ఆయన చేసిన పోరాటాన్ని స్మరించుకున్నారు. తెలంగాణ సాధనకు బాపూజీ చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ సిబ్బందులు పాల్గొన్నారు.



