వరి ధాన్యం కొనుగోళ్లపై సమీక్ష

వానకాలం (ఖరీఫ్) వరి ధాన్యం కొనుగోళ్లపై కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఇవాళ సమీక్ష నిర్వహించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు. ట్యాబ్ ఎంట్రీలు వేగంగా పూర్తి చేసి రైతులకు సరైన టైములో డబ్బులు జమ చేయాలన్నారు. బోనస్ వచ్చే 7 రకాల సన్న ధాన్యంపై సెంటర్ ఇన్‌చార్జ్‌లకు అవగాహన కల్పించాలని సూచించారు.


