చిన్న సినిమాలకు థియేటర్లు దక్కవు: షిరాజ్ మెహదీ

చిన్న సినిమాలకు థియేటర్లు దక్కడం కష్టంగా మారిందని ‘ఓ అందాల రాక్షసి’ సినిమా నటుడు, దర్శకుడు షిరాజ్ మెహదీ ఆవేదన వ్యక్తం చేశారు. సినిమా నిర్మాణానికి 10 కోట్లకు పైగా ఖర్చు చేశామని, ఆశించిన స్థాయిలో థియేటర్లు దక్కకపోవడంతో నష్టం వచ్చిందని తెలిపారు. కొత్త నిర్మాతలు, దర్శకులు ఇండస్ట్రీపై అవగాహన లేకుండా సినిమాలు తీయొద్దని సూచించారు. డిస్ట్రిబ్యూషన్ దగ్గరే అసలు సమస్య వస్తోందని, చిన్న సినిమాలకు సరైన థియేటర్లు దక్కేలా మార్పులు రావాలని కోరారు.



