బస్‌భవన్‌లో కొండా లక్ష్మణ్ జయంతి వేడుకలు

హైదరాబాద్ నగరంలోని ముషీరాబాద్ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో ఉన్న TGSRTC బస్‌భవన్‌లో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థ ED సీహెచ్. వెంకన్న బాపూజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి, ప్రజా హక్కులు, సామాజిక న్యాయం కోసం బాపూజీ చేసిన సేవలు చిరస్మరణీయమని ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం బాపూజీ చేసిన త్యాగాలు భావితరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయని పేర్కొన్నారు.



