ఎండపల్లిలో పారిశుధ్యం అధ్వానం

జగిత్యాల జిల్లా ఎండపల్లి మండల కేంద్రంలోని ప్రధాన కూడలిలో చెత్త కుండీలు నిండిపోయి వ్యర్థాలు రోడ్డుపైకి చేరుతున్నాయి. గ్రామ పంచాయతీ ఏర్పాటు చేసిన పొడి, తడి చెత్త కుండీలు నిండిపోవడంతో దుర్వాసన వెదజల్లుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాలకు చెత్తలో నీరు చేరడంతో దోమలు, ఈగలు పెరిగి వ్యాధులు వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వినాయక నిమజ్జనాలకు వచ్చే భక్తులకు కూడా ఇబ్బందులు కలుగుతున్నాయని తెలిపారు. అధికారులు చెత్తను తొలగించి, కుండీలను శుభ్రం చేయాలని కోరుతున్నారు.


