ఎండ తీవ్రత.. అప్రమత్తంగా ఉండాలి!

చలికాలంలోనూ ఎండ తీవ్రత పెరిగే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఖమ్మం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ డి. రామారావు సూచించారు. మధ్యాహ్నం ఎండలో ఎక్కువసేపు తిరగవద్దు. బయటకు వెళ్తే గొడుగు, టోపీ వాడాలన్నారు.. తరచూ నీరు తాగాలని, తేలికపాటి దుస్తులు ధరించాలని చెప్పారు. చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణులు, దీర్ఘకాలిక రోగులు మరింత జాగ్రత్తగా ఉండాలన్నారు. తల తిరగడం, నీరసం, అధిక దాహం వంటివి తీవ్రమైతే వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాలన్నారు.



