మణికొండలో చెడ్డీ గ్యాంగ్!
TG: హైదరాబాద్.. మణికొండలో చెడ్డీ గ్యాంగ్ కలకలం రేపింది. ఆదివారం తెల్లవారుజామున 3 గంటల 20 నిమిషాల టైంలో ఫ్లోటిల్లా అపార్ట్‌మెంట్స్‌లోకి ఆరుగురు అనుమానితులు ప్రవేశించినట్లు CCTV ఫుటేజ్ చూపిస్తోంది. లేక్ సైడ్ ఉన్న ఫెన్సింగ్‌ను కత్తిరించి C-BLOCK లోని ఓ ఫ్లాట్‌లో చోరీ చేశారు. వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఓ మహిళపై ఆయుధాలతో దాడికి యత్నించినట్లు సమాచారం. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

