కొత్తపల్లిలో యువతి మిస్సింగ్

హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన 19 ఏళ్ల యువతి అదృశ్యమైన ఘటనపై ముల్కనూర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. సెప్టెంబర్ 21న రాత్రి కుటుంబసభ్యులతో కలిసి భోజనం చేసిన అనంతరం సౌజన్య ఇంట్లో నిద్రపోయింది. అర్థరాత్రి సుమారు ఒంటిగంట సమయంలో కుటుంబసభ్యులు లేచి చూడగా ఆమె కనిపించలేదు. దీంతో బంధువుల ఇళ్లలో ఆరా తీసినప్పటికీ ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి యువతి ఆచూకీ కోసం వివరాలు సేకరిస్తున్నట్లు ముల్కనూర్ ఎస్సై రాజు తెలిపారు.


