డిగ్రీ సీట్లకు స్పాట్ అడ్మిషన్లు.. 24, 25న!

TG: తెలంగాణలో డిగ్రీ కాలేజీల్లో మిగిలిన సీట్ల భర్తీకి సెప్టెంబర్ 24, 25వ తేదీల్లో స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నారు. ఈరోజు కాలేజీల వారీగా ఖాళీ సీట్ల వివరాలను అనౌన్స్ చేస్తారు. స్పాట్ అడ్మిషన్‌కు ₹425 రిజిస్ట్రేషన్ ఫీజు, ఒరిజినల్ సర్టిఫికెట్లు అవసరం. ఇంకా మిగిలే సీట్ల కోసం సెప్టెంబర్ 28, 29న స్పెషల్ స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తారు. 28, 29వ తేదీలు అదనంగా ఇచ్చే చివరి విడత స్పాట్ అవకాశం. స్పాట్‌లో చేరినవారికి ఫీ రీయింబర్స్‌మెంట్ వర్తించదు.


