← Back to news

శ్రీ పరివార్ యోగా సమితి కొత్త కమిటీ

By srikanth· 1h ago· Warangal
శ్రీ పరివార్ యోగా సమితి కొత్త కమిటీ

శ్రీ పరివార్ యోగ సాధన సేవా సమితి తొగర్రాయి, గిర్నిబావి ఉమ్మడి కమిటీని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వరంగల్ జిల్లా గిర్నిబావిలో జరిగిన ఈ కార్యక్రమంలో అధ్యక్షుడిగా బొమ్మ నారాయణ రెడ్డి, ఉపాధ్యక్షుడిగా బండి నరేష్, ప్రధాన కార్యదర్శిగా అమ్మ మల్లయ్య ఎన్నికయ్యారు. అలాగే కార్యదర్శిగా చల్ల అరుణ, కోశాధికారిగా బుడుగొండ కుమారస్వామి, ప్రచార కార్యదర్శులుగా మండల శంకరయ్య, అలువాల రాజులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ప్రకటించారు.

More in Local