ఉస్మానియా హాస్పిటల్లో వైద్యుల ఆందోళన

TG: హైదరాబాద్లోని ఉస్మానియా హాస్పిటల్లో సరైన సదుపాయాలు కల్పించాలని కోరుతూ వైద్య విద్యార్థులు, జూనియర్ డాక్టర్లు ఆందోళన చేశారు. హాస్పిటల్లో మందులు, వైద్య పరికరాలు, ఇతర సదుపాయాల కొరతతో రోగులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని వారు తెలిపారు. నిన్న నిర్వహించిన ఈ నిరసనలో 700 మందికి పైగా పాల్గొన్నారు. రోగులకు మెరుగైన వైద్యం అందేలా ప్రభుత్వం వెంటనే సమస్యలను పరిష్కరించాలని కోరారు.



