విద్యార్థినులపై లైంగిక వేధింపులు.. టీచర్ల సస్పెన్షన్

AP: కాకినాడలో విద్యార్థినులను లైంగికంగా వేధించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు టీచర్లను సస్పెండ్ చేసినట్లు డీఈవో పి.రమేష్ తెలిపారు. ఏలేశ్వరం మండలం.. ఏలేశ్వరం ZP హైస్కూలులో పీఎస్ టీచర్‌గా పనిచేస్తున్న రెడ్డి శ్రీనివాసరావు, యు.కొత్తపల్లి మండలం.. మూలపేట ZP హైస్కూలులో పీఎస్ టీచర్‌గా పనిచేస్తున్న జోగా సురేష్‌లపై.. వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిన తర్వాత ఈ చర్యలు తీసుకున్నామని డీఈవో వివరించారు.


