← Back to news

లోయలో పడి లారీకి నిప్పు

By BK· 2h ago· కడప

AP : కడప జిల్లా గువ్వలచెరువు ఘాట్ రోడ్డులో యాక్సిడెంట్ జరిగింది. సిమెంట్ లోడుతో ఉన్న ఒక లారీ కంట్రోల్ తప్పి, గోడను ఢీకొట్టి డైరెక్ట్‌గా లోయలోకి దూసుకెళ్ళింది. కింద పడగానే లారీలో హెవీగా మంటలు చెలరేగాయి. అందులో ఉన్న డ్రైవర్, క్లీనర్ అక్కడికక్కడే సజీవ దహనమైనట్లు తెలుస్తోంది. ఫారెస్ట్ ఏరియా అవ్వడంతో మంటలు అడవికి కూడా స్ప్రెడ్ అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది మంటలని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

More in AP