బీసీలను మోసం చేసిన చంద్రబాబు: నౌడు వెంకటరమణ

రాజమహేంద్రవరంలో YSRCP నిర్వహించిన 'బీసీ గర్జన' కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ నౌడు వెంకటరమణ పాల్గొని మాట్లాడారు. ఎన్నికల సమయంలో బీసీలకు ఎన్నో హామీలు ఇచ్చిన CM చంద్రబాబు నాయుడు, అధికారంలోకి వచ్చాక వాటిని గాలికి వదిలేసి బీసీలకు వెన్నుపోటు పొడిచారని ఆయన విమర్శించారు. ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులు పెట్టడంపై ఉన్న శ్రద్ధ, బీసీల సంక్షేమంపై ప్రభుత్వం చూపించడం లేదని, బీసీ వర్గాలను తీవ్రంగా మోసం చేశారని ఆయన మండిపడ్డారు.



