← Back to news

మద్దిగెడ్డ డ్యాంలో భారీగా పెరిగిన నీటి నిల్వ

By Venkata Apparao· 1d ago· Addateegala, Addateegala, Polavaram
మద్దిగెడ్డ డ్యాంలో భారీగా పెరిగిన నీటి నిల్వ

పోలవరం జిల్లా అడ్డతీగల మండలంలోని మద్దిగెడ్డ డ్యాంలో నీటినిల్వలు గణనీయంగా పెరగడంతో రబీ రైతులకు ఇరిగేషన్ అధికారులు గుడ్‌న్యూస్ చెప్పారు. వర్షాలు లేక ఖరీఫ్ పంటలు నష్టపోయిన రైతులకు తాజాగా కురిసిన వర్షాలు ఊరటనిచ్చాయి. కురిసిన భారీ వర్షాలకు గతంలో ఎండిపోయిన మద్దిగెడ్డ డ్యామ్ నిండుకుండలా మారింది. డ్యాంలో నీటిమట్టం 186మీటర్లకు చేరగా, మొత్తం 0.484 TMCల సామర్థ్యానికి 0.348 TMCల నీరునిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు. రబీ పంటలకు ఈ నీరు సాగుకు సరిపోతుందన్నారు.

మద్దిగెడ్డ డ్యాంలో భారీగా పెరిగిన నీటి నిల్వ

More in Local