విరిగిన స్తంభంతో ముప్పు.. పట్టించుకోరా?

వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం బూడిదపాడు గ్రామ శివారులోని వాగు వంతెన సమీపంలో విద్యుత్తు స్తంభం ప్రమాదకరంగా ఉంది. ఓ ప్రైవేటు కంపెనీకి చెందిన కేంద్రానికి విద్యుత్తు సరఫరా అయ్యే స్తంభాన్ని ఏడాది క్రితం గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో విరిగింది. అప్పటి నుంచి ఊతంగా పెట్టిన స్తంభాల ఆధారంగా నిలిచింది. చౌడు భూమి కావడంతో స్థిరత్వం ఉండ దని.. నేల కుంగి వాలి పోయే ప్రమాదం ఉందని గ్రామస్థులు భయాందోళ నకు గురవుతున్నారు.



