రైతుల కోసం మంత్రి తుమ్మల కీలక ప్రతిపాదనలు

రైతుల భూమికి రక్షణ, సాగునీటి ప్రాజెక్టుల వ్యయ నియంత్రణ, విద్యుత్ ప్రమాదాల నివారణే లక్ష్యంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సీఎం రేవంత్రెడ్డికి పలు ప్రతిపాదనలు చేశారు. సీతారామ ఎత్తిపోతల పథకం పంపిణీ కాలువలను సాధ్యమైన చోట పైపులైన్లుగా మార్చాలని సూచించారు. ఆయిల్పామ్ తోటల్లో విద్యుత్ తీగల వల్ల ప్రమాదాలు జరగకుండా 11 కేవీ లైన్లకు కవర్డ్ కండక్టర్లు, అవసరమైన చోట ఎల్టీ లైన్లకు ఏబీ కేబుళ్లు ఏర్పాటు చేయాలని కోరారు.



