← Back to news

మహిళా సమైక్య భవన్‌కు డీకే అరుణ శంకుస్థాపన

By Surendar Panuganti· 7h ago
మహిళా సమైక్య భవన్‌కు డీకే అరుణ శంకుస్థాపన

TG: మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం పోలేపల్లి గ్రామంలో మహిళా సమైక్య భవన్ నిర్మాణానికి ఎంపీ డీకే అరుణ, ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. ముందుగా గ్రామంలోని శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం నిర్మాణ పనులను ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులు, కమ్యూనిటీ భవనాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. భవనం అందుబాటులోకి వస్తే సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు.

మహిళా సమైక్య భవన్‌కు డీకే అరుణ శంకుస్థాపన

More in Local