← Back to news

బాల్య వివాహాల నిర్మూలనకు సమష్టి కృషి

By RAMESH· 4d ago· Asifabad, Asifabad, Kumuram Bheem Asifabad
బాల్య వివాహాల నిర్మూలనకు సమష్టి కృషి

బాల్య వివాహాల నిర్మూలనకు అన్ని శాఖలు, స్వచ్ఛంద సంస్థలు సమన్వయంతో అంకితభావంతో పనిచేయాలని జిల్లా సంక్షేమ అధికారి స్వరూపారాణి అన్నారు. జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయంలో ఎయిడ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో రూపొందించిన బాల్య వివాహాల నిర్మూలన అవగాహన పోస్టర్‌ను జిల్లా బాలల సంరక్షణ అధికారి మహేష్‌తో కలిసి ఆవిష్కరించారు. బాల్య వివాహాల వల్ల బాలికల విద్య, ఆరోగ్యం, భద్రత, భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం పడుతుందని తెలిపారు.

More in Local