IAS దివ్య మిట్టల్ రాజీనామా ఆమోదం

ఉత్తరప్రదేశ్ కేడర్‌కు చెందిన 2013 బ్యాచ్ IAS అధికారి దివ్య మిట్టల్ రాజీనామాను కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. వ్యక్తిగత కారణాలు, కుటుంబ బాధ్యతలు, జీవిత ప్రాధాన్యతల్లో మార్పులను పేర్కొంటూ ఆమె ఆగస్టు 30న రిజైన్ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సదుపాయాల మెరుగుదలకు ఆమె చేసిన కృషితో ప్రత్యేకంగా గుర్తింపు పొందారు.


