← Back to news

తెలంగాణలో వానలు ఆగవు.. మరో వారం వర్షాలే!

By Jagadish· 2d ago
తెలంగాణలో వానలు ఆగవు.. మరో వారం వర్షాలే!

తెలంగాణలో వర్షాల ఉద్ధృతి తగ్గే సూచనలు లేవు. మరో వారం రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. రానున్న 24 గంటల్లో పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడొచ్చని హెచ్చరిక జారీ చేసింది. ములుగు, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, ఆదిలాబాద్, కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. నిర్మల్, జగిత్యాల, నిజామాబాద్, నల్గొండ, నాగర్‌కర్నూల్ జిల్లాల్లోనూ మోస్తరు వర్షాలు పడతాయి. హైదరాబాద్‌లోనూ వర్షాలు కురుస్తాయని అంచనా.

More in Politics