కనెక్టివిటీ రోడ్డు ఇవ్వాలని ప్రజల నిరసన

జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మీదుగా వెళ్తున్న భారత్‌మాల రోడ్డు నిర్మాణ పనులు దాదాపు పూర్తయ్యాయి. కానీ మండల కేంద్రమైన రాజోలికి మాత్రం కనెక్టివిటీ రోడ్డు ఇవ్వకపోవడంతో లోకల్ పీపుల్ మండిపడుతున్నారు. తమ ఊరికి తప్పనిసరిగా కనెక్టివిటీ రోడ్డు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రాజోలి గ్రామస్తులు నేరుగా భారత్‌మాల రోడ్డుపై బైఠాయించి నిరసన చేస్తున్నారు.
