← Back to news

డేటా సెంటర్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు!

By Anusha· 7 Oct 2026
డేటా సెంటర్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు!

AP: విశాఖలో నిర్మిస్తున్న హైపర్‌స్కేల్ డేటా సెంటర్‌పై ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అడవివరం, ముడసర్లోవలో ప్రాజెక్టు నిర్మాణాన్ని సొంత రిస్క్‌తో కొనసాగించవచ్చని తెలిపింది. అయితే తుది తీర్పు ప్రాజెక్టుకు వ్యతిరేకంగా వస్తే భారీగా ఇన్వెస్ట్‌మెంట్ పెట్టామనే కారణంతో ఈక్విటీ కోరలేరని స్పష్టం చేసింది. ఎన్విరాన్‌మెంటల్ రూల్స్ తప్పనిసరిగా పాటించాలని, పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని డేటా సెంటర్ యాజమాన్యాన్ని ఆదేశించింది.

More in AP