← Back to news

కిల్లో రాజన్‌కు రాష్ట్ర సమన్వయ కమిటీ సభ్యుడిగా బాధ్యతలు

By SINDERI KAMESH· 1d ago· Pathapaderu, Paderu, Alluri Sitharama Raju
కిల్లో రాజన్‌కు రాష్ట్ర సమన్వయ కమిటీ సభ్యుడిగా బాధ్యతలు

అల్లూరి సీతారామరాజు జిల్లా పార్టీ అధ్యక్షుడు కిల్లో రాజన్‌కు భారత చైతన్య యువజన పార్టీ రాష్ట్ర సమన్వయ కమిటీ సభ్యుడిగా బాధ్యతలు అప్పగించారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు బోడె రామచంద్ర యాదవ్ ఆదేశాల మేరకు ఈ నియామకం జరిగినట్లు పార్టీ నాయకులు తెలిపారు. కొత్త బాధ్యతలను సమర్థంగా నిర్వహించి పార్టీ కార్యకలాపాలను ముందుకు తీసుకెళ్లాలని జిల్లా ఉపాధ్యక్షుడు పాంగి నవీన్ ఆకాంక్షించారు. కిల్లో రాజన్ నియామకంపై పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేసి అభినందనలు తెలిపారు.

More in Local