← Back to news

రైతుల క్షేమమే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి

By DK· 1d ago
రైతుల క్షేమమే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి

మహబూబ్‌నగర్ జిల్లా కౌకుంట్ల మండల రైతులకు 20 ట్రాన్స్‌ఫార్మర్లను ఉచితంగా పంపిణీ చేసినట్లు ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి తెలిపారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు తగ్గి పంటలు ఎండిపోతున్న నేపథ్యంలో రైతులు లోవోల్టేజ్ సమస్యతో ఇబ్బందులు పడకూడదని ట్రాన్స్‌ఫార్మర్లు అందిస్తున్నట్లు చెప్పారు. దేవరకద్ర, చిన్నచింతకుంట మండలాల్లోనూ రైతులకు ట్రాన్స్‌ఫార్మర్లు పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. ఇటీవల కురిసిన వర్షాలతో కోయిల్‌సాగర్ ప్రాజెక్టుకు నీటిని తరలించి, రైతుల అవసరాలకు విడుదల చేసినట్లు తెలిపారు.

More in Local