ప్రమాదాల నివారణకు కీలక చర్యలు

అనకాపల్లి జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు సమన్వయంతో చర్యలు చేపట్టాలని కలెక్టర్ విజయ కృష్ణన్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో SP తుహిన్ సిన్హాతో కలిసి Road Safety Committee సమావేశం నిర్వహించారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ప్రమాదాలు, ప్రాణనష్టం తగ్గినప్పటికీ బైక్‌లు, త్రీవీలర్ల ప్రమాదాలు ఎక్కువగా ఉన్నట్లు తెలిపారు. 25 నుంచి 35 ఏళ్ల యువత ఎక్కువగా గాయపడుతున్నట్లు చెప్పారు. ప్రమాదం జరిగిన 24 గంటల్లోపు Police, R&B, Panchayat Raj, NH శాఖల అధికారులు Joint Audit నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు.



