← Back to news

🕳️ రోడ్డులో గుంతలా.. గుంతల్లో రోడ్డా?

By BK· 1d ago· బాపట్ల
🕳️ రోడ్డులో గుంతలా.. గుంతల్లో రోడ్డా?

బాపట్ల జిల్లా అమృతలూరు-గోవాడ-తాళ్లచెరువు మధ్య 3 కిలోమీటర్లు రోడ్డు ఘోరంగా తయారైంది. రోడ్డంతా పెద్ద పెద్ద గోతులతో చిన్న వర్షానికే చెరువులా మారుతోంది. పదేళ్లుగా ఈ పరిస్థితి మారకపోవడంతో ఊళ్ల జనం రాకపోకలకు ఇబ్బంది పడుతున్నారు. గుంతల్లో నీళ్లు చేరి ఎక్కడ గుంత ఉందో తెలియక బైకర్స్ స్కిడ్ అయి పడిపోతున్నారు. సాఫీగా వెళ్లే దారి లేక జనం యాక్సిడెంట్ల పాలవుతున్నారు. ఇప్పటికైనా గవర్నమెంట్ దీనివైపు చూడాలని ప్రజలు డిమాండ్ చేస్తునారు.

More in Local