← Back to news

GVMC మేయర్ పదవిని దళితులకు ఇవ్వాలి

By DK· 13h ago
GVMC మేయర్ పదవిని దళితులకు ఇవ్వాలి

విశాఖపట్నం నగరంలో దళితుల జనాభాను దృష్టిలో ఉంచుకుని GVMC మేయర్ సీటును దళితులకు కేటాయించాలని తెలుగు శక్తి అధినేత బీవీ రామ్, దళిత నాయకుడు పెద్దాడ రమణ డిమాండ్ చేశారు. రామా టాకీస్ అంబేద్కర్ భవన్ వద్ద నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. వారు మాట్లాడుతూ.. ఇప్పటివరకు మేయర్ సీటును BC, OC వర్గాలకు కేటాయించారని, ఈసారి దళితులకు అవకాశం ఇవ్వాలని కోరారు. దళితులకు సముచిత ప్రాతినిధ్యం కల్పించాలని అన్నారు.

More in Local