← Back to news

బంగారు కమ్మల కోసం వృద్ధురాలిపై దాడి

By DK· 21h ago
బంగారు కమ్మల కోసం వృద్ధురాలిపై దాడి

TG: నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గౌతమ్‌నగర్‌లో ఒంటరిగా నిద్రిస్తున్న 70 ఏళ్ల వృద్ధురాలిపై దుండగుడు దాడి చేసి బంగారు కమ్మలు దోపిడీ చేశాడు. ఆదివారం అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడిన దొంగ వృద్ధురాలి చెవుల కమ్మలను తీసేందుకు ప్రయత్నించాడు. అవి రాకపోవడంతో కత్తెరతో చెవులకు గాయపరిచి కమ్మలను దోచుకెళ్లాడు. ఆమె కేకలు విన్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని గాయపడిన వృద్ధురాలిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు రాసి చేసి ఇన్వెస్టిగేషన్ చేపట్టారు.

More in TG