← Back to news

కాక్రవేణి నదిలో అక్రమ ఇసుక రవాణా

By DK· 2d ago
కాక్రవేణి నదిలో అక్రమ ఇసుక రవాణా

TG: వికారాబాద్ జిల్లా యాలాల మండలం విశ్వనాథ్‌పూర్ శివారులోని కాక్రవేణి నదిలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న వాహనాలను బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి అడ్డుకున్నారు. అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు. అధికారుల కళ్లముందే అక్రమ రవాణా జరుగుతున్నా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కొందరు నాయకులకు ముడుపులు చెల్లిస్తున్నారనే ఆరోపణలపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు.

More in Local