సామర్లకోట రైల్వే స్టేషన్‌లో స్వచ్ఛత డ్రైవ్

స్వచ్ఛత హి సేవా-2026లో భాగంగా కాకినాడ జిల్లా సామర్లకోట జంక్షన్ రైల్వే స్టేషన్‌లో పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించారు. భారతీయ రైల్వే ఆధ్వర్యంలో సెప్టెంబర్ 17నుంచి అక్టోబర్ 15వరకు దేశవ్యాప్తంగా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. రైల్వే సిబ్బంది, కాంట్రాక్ట్ స్టాఫ్ పాల్గొని స్టేషన్ పరిసరాలను శుభ్రం చేశారు. అనంతరం ప్రత్యేక గేమ్స్ నిర్వహించారు. డాక్టర్ శ్రీలక్ష్మి, స్టేషన్ మేనేజర్ రమేష్, హెల్త్ ఇన్స్పెక్టర్ కళ్యాణి, వివిధ డిపార్ట్మెంట్ల స్టాఫ్ పాల్గొన్నారు.



