అల్లూరి జిల్లాలో ఇవాళ, రేపు స్కూళ్లకు సెలవు

అల్లూరి సీతారామరాజు జిల్లాకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. దీంతో బుధవారం జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు కలెక్టర్ నిషాంతి సెలవు ప్రకటించారు. విద్యార్థుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో రెసిడెన్షియల్ పాఠశాలల్లో విద్యార్థులు బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అత్యవసర పరిస్థితుల్లో విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.


