పంటలు దెబ్బతినడంపై CPM ఆందోళన

భారీ వర్షాలు, వరదల వల్ల అల్లూరి సీతారామరాజు జిల్లా గొందిగూడ, కూడా, నువ్వుగూడ గ్రామాల్లో రైతులు పండించిన అల్లం, వరి, రాగులు, రాజ్‌మా పంటలతో నష్టపోయారని CPM నేత తెలిపారు. రైతులతో కలిసి ఆయన పంట పొలాలను పరిశీలించారు. మొదట వర్షాల్లేక, ఆ తర్వాత తుపాను వరదలతో పంటలు కొట్టుకుపోయాయని, అధికారులు వెంటనే సర్వే చేసి నష్టపోయిన రైతులకు గవర్నమెంట్ పరిహారం అందించాలని డిమాండ్ చేశారు.




