26న గద్వాలలో స్వేరో ముఖ్య నాయకుల సమావేశం

జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో ఈ నెల 26న స్వేరో ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించనున్నట్లు ఇన్‌చార్జ్ దుబ్బ నాగేష్ తెలిపారు. సమాజంలో చైతన్యం పెంచుతూ జ్ఞానసమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన కోరారు. బహుజన సమాజం అక్షరం, ఆరోగ్యం, ఆర్థికం, అధికారం దిశగా ముందుకు సాగాలని సూచించారు. స్వేరోయిజాన్ని సమాజంలో విస్తృతంగా ప్రచారం చేసేందుకు యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు. సమావేశం అనంతరం గద్వాల జిల్లా నూతన కమిటీని ఎన్నుకోనున్నట్లు తెలిపారు.


