స్వచ్ఛ పాఠశాల.. వరల్డ్ రికార్డ్!
గుంటూరు జిల్లా మంగళగిరి-తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 'స్వచ్ఛ పాఠశాల' కార్యక్రమం ప్రపంచ రికార్డు సాధించింది. 170 పాఠశాలలకు చెందిన 35 వేల మంది విద్యార్థులు పాల్గొని 75 వేల కిలోల పొడి చెత్త సేకరించారు. ఈ కార్యక్రమం 'వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్'లో నమోదైంది. రికార్డు సాధనకు కృషి చేసిన విద్యార్థులు, ఉపాధ్యాయులు, అధికారులకు మంత్రి నారా లోకేష్ అభినందనలు తెలిపారు. పర్యావరణ పరిరక్షణ, స్వచ్ఛతపై అవగాహన కార్యక్రమాలు నిరంతరం కొనసాగాలని ఆకాంక్షించారు.


