నేలకొండపల్లికి పర్యాటక శోభ

TG: ఖమ్మం జిల్లా, నేలకొండపల్లి మండలం, ముజ్జుగూడెంలోని మహా బౌద్ధ స్థూపం ప్రాంతాన్ని.. పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్లాన్ రెడీ చేస్తోంది. బాలసముద్రం చెరువు చుట్టూ బోటింగ్, వ్యూ ఏరియాలు, రెస్ట్ ప్లేసెస్, పచ్చిక మైదానాలు ఏర్పాటు చెయ్యాలనేది ప్రభుత్వ ప్లాన్. బౌద్ధ ప్రార్థనా మందిరం, మ్యూజియం, 3డీ సెంటర్, వాకింగ్ ట్రాక్స్, 24 కాటేజీలు, 20 బెడ్స్ డార్మిటరీ, ఫుడ్ కోర్టు, షాపులు ఏర్పాటు చేసేలా ఈ ప్లాన్ ఉంది.

