రూ.2.5 కోట్లతో గిరిజన హాస్టల్ నిర్మాణం మంత్రి శంకుస్థాపన

ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీలోని TNGOs కాలనీలో గిరిజన బాలుర పోస్ట్‌మెట్రిక్ హాస్టల్ నిర్మాణానికి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోమవారం రాత్రి శంకుస్థాపన చేశారు. ఈ హాస్టల్‌ను 2.5 కోట్ల రూపాయలతో నిర్మించనున్నారు. త్వరలో బాలికల హాస్టల్ నిర్మాణానికి కూడా శంకుస్థాపన చేస్తామని మంత్రి చెప్పారు. అనంతరం ముత్తగూడెంలో దేవీ నవరాత్రుల సందర్భంగా అన్నదానాన్ని ప్రారంభించి, ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు.




