రష్యాలో తెలంగాణ యువకుల పరిస్థితిపై ఆందోళన

రష్యా <a href="https://www.theclearcutnews.com/n/Mfb57hU">ఆర్మీ జాబ్స్ </a>పేరుతో మోసపోయిన తెలంగాణ యువకుడు మహమ్మద్ అఫ్జల్ ఖాన్ ఆచూకీ ఇంకా తెలియలేదని,అతను చనిపోయినట్లు వస్తున్న వార్తలను రష్యా అధికారులు ధృవీకరించలేదని భారత రాయబార కార్యాలయం తెలిపింది. మరోవైపు, రష్యా సైన్యంలో ఉన్న అశోక్ డ్రోన్ దాడిలో గాయపడి, బందీగా ఉన్నట్లు తన భార్యకు ఆడియో మెసేజ్ పంపాడు. తెలంగాణకు చెందిన నలుగురు యువకులను విడిపించేందుకు భారత అధికారులు ప్రయత్నిస్తున్నారు. దీనిపై మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని అధికారులు తెలిపారు.



