జాషువా జయంతి.. గుంటూరులో ప్రత్యేక కార్యక్రమం

గుర్రం జాషువా సాహిత్యం, సామాజిక సమానత్వం, మానవతా విలువలను స్మరించుకుంటూ గుంటూరులో ఆదివారం జయంతి సభ, పురస్కార ప్రదానోత్సవం నిర్వహించనున్నారు. గుంటూరులోని బ్రాడీపేటలో ఉన్న గుర్రం జాషువా విజ్ఞాన కేంద్రంలో సాయంత్రం 4గంటలకు కార్యక్రమం ప్రారంభం కానుంది. ప్రముఖ తెలుగు కవి గుర్రం జాషువా 131వ జయంతి సందర్భంగా సభను నిర్వహిస్తున్నట్లు నిర్వాహక కమిటీ తెలిపింది. సాహిత్యం, సామాజిక సేవ తదితర రంగాల్లో విశేష కృషిచేసిన వారికి ఈ సందర్భంగా పురస్కారాలు అందించనున్నారు.



