జూనియర్ కబడ్డీ జట్ల ఎంపిక పోటీలు

NTR జిల్లా కబడ్డీ సంఘం ఆధ్వర్యంలో జిల్లా జూనియర్ బాలబాలికల కబడ్డీ జట్ల ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు సంఘం కార్యదర్శి తోకల సుధాకర్ తెలిపారు. వచ్చే నెల 3న స్థానిక రైల్వే మినీ స్టేడియంలో ఎంపికలు జరుగుతాయని పేర్కొన్నారు. 2006 నవంబర్ 4 తర్వాత జన్మించిన బాలబాలికలు అర్హులని తెలిపారు. బాలుర బరువు 75 కేజీల లోపు, బాలికల బరువు 65 కేజీల లోపు ఉండాలని సూచించారు. అర్హత ఉన్న క్రీడాకారులు ఎంపిక పోటీలకు హాజరుకావాలని కోరారు.



