← Back to news

కస్తూర్బా గాంధీ స్కూళ్లలో 1,092 ఖాళీలు

By Lokesh· 4h ago
కస్తూర్బా గాంధీ స్కూళ్లలో 1,092 ఖాళీలు

AP: ఆంధ్రప్రదేశ్‌లోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో 1,092 నాన్‌ టీచింగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అసిస్టెంట్, కుక్, వాచ్‌మెన్, అటెండర్, స్వీపర్ వంటి ఉద్యోగాలు ఉన్నాయి. ఇవి రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగాలు కాదు. అవుట్‌సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తారు. నెలకు 12 వేల రూపాయల నుంచి 18 వేల వరకు శాలరీ ఉంటుంది. ప్రస్తుతం ఏజెన్సీని ఎంపిక చేసే టెండర్ ప్రక్రియ జరుగుతోంది. అది పూర్తయ్యాకే నోటిఫికేషన్ ఇచ్చి అప్లికేషన్లు తీసుకుంటారు.

More in AP