విద్యుత్ షాక్.. గీత కార్మికుడి మృతి!

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సంగం మండలం మర్రిపాడులో విషాదం. కల్లు గీత కార్మికుడు పంది మహేంద్ర (40) ఇంట్లో వైర్లు బిగిస్తుండగా విద్యుత్ షాక్ తగిలింది. కుటుంబం ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేసింది. కానీ అప్పటికే మృతి చెందాడని వైద్యులు చెప్పారు.



