← Back to news

APకి ప్రత్యేక FRRO.. విదేశాలకు వెళ్లేవారికి అలర్ట్

By Sharmila· 12h ago
APకి ప్రత్యేక FRRO.. విదేశాలకు వెళ్లేవారికి అలర్ట్

AP: అమరావతిలో ఫారినర్స్ రీజనల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్‌ - FRRO ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర హోంశాఖ మంగళవారం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఇప్పటివరకు హైదరాబాద్‌ FRRO పరిధిలో ఆంధ్రప్రదేశ్‌ ఉండేది. తాజా నిర్ణయంతో ప్రత్యేకంగా అమరావతి లోనే FRRO ఆఫీస్ రానుంది. విదేశీయుల రిజిస్ట్రేషన్, ఇమ్మిగ్రేషన్, వీసా పొడిగింపు, వీసా మార్పు వంటి సేవలను ఈ ఆఫీసు చూస్తుంది. దేశంలో ప్రస్తుతం 12 FRROలు ఉండగా, అమరావతికి 13వ ఆఫీసు రానుంది.

More in AP